WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (36) శుభారంభం ఇవ్వగా, లిజెల్లీ లీ (67) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు. ఈ విజయంతో తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో తమ ఖాతాను తెరిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్