బతుకమ్మను ఎత్తుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (వీడియో)

ఢిల్లీలో వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ యూనియన్ ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కొణిదల ఉపాసన హాజరయ్యారు. బతుకమ్మ కేవలం పువ్వుల పండుగ కాదని, మాతృత్వం, జీవితం, ప్రకృతి లయకు చిహ్నమని రేఖా గుప్తా అన్నారు. ఇది సృష్టి యొక్క కరుణ, జీవిత శక్తిని ప్రతిబింబిస్తుందని, ఇక్కడి విద్యార్థులు తెలుగు సంస్కృతి గర్వాన్ని పెంచుతూ, భారత యువత శక్తిని చాటుతున్నారని ఆమె ప్రశంసించారు. నిర్వాహకులను ఆమె అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్