త్వరలో ఢిల్లీ సీఎంను అరెస్ట్‌ చేస్తారు: కేజ్రీవాల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో ఢిల్లీ సీఎం అతిశీని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. ఆప్‌ ప్రభుత్వం రెండు పథకాలు ప్రకటించడం కొందరికి నచ్చలేదని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సీఎంను తప్పుడు కేసులో అరెస్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్‌ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చన్నారు.

సంబంధిత పోస్ట్