ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి 11.35 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆమె తనను NIA అధికారిణిగా పరిచయం చేస్తూ నకిలీ ఐడీ కార్డు చూపించింది. బ్యాగ్‌లో NIA లోగో, జాతీయ చిహ్నం ఉన్న కవర్లలో డ్రగ్స్ దాచినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్