ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు షాక్

సంగీత దిగ్గజం ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. 1976 నుండి వచ్చిన దాదాపు 134 సినిమాల్లోని వివాదాస్పద పాటలను ఇళయరాజా ఎక్కడా ప్రసారం చేయకుండా లేదా ఇతరులకు చేరవేయకుండా కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. జస్టిస్ తుషార్ రావు గెడెలా నేతృత్వంలోని ధర్మాసనం, ఇళయరాజాకు తాను సృష్టించిన స్వరాలపై మాత్రమే కాపీరైట్ హక్కులు ఉంటాయని, సినిమాల్లో ఉపయోగించిన పూర్తి సౌండ్ రికార్డింగ్స్‌పై ఆయనకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది. సరిగమ ఇండియా లిమిటెడ్ సంస్థ వాదనల మేరకు ఈ తీర్పు వెలువడింది.

సంబంధిత పోస్ట్