ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని తెలిపారు. అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.