డెలివరీ బాయ్‌పై దాడి ఆరోపణల నేపథ్యంలో 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ స్పందించారు. డెలివరీ బాయ్ తప్పు చిరునామాకు పార్సిల్ ఇచ్చి వెళ్లిన తర్వాత తిరిగి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాకుండా మద్యం మత్తులో తన తల్లిని దుర్భాషలాడాడని తెలిపారు. ఆ పరిస్థితుల్లోనే వాగ్వాదం జరిగిందని, కావాలని ఎవరిపైనా దాడి చేయలేదని స్పష్టం చేశారు. తాను కూడా ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని, ఆ ఉద్యోగం విలువ తనకు తెలుసని అఖిల్ రాజ్ పేర్కొన్నారు.