108 అంబులెన్స్‌లోనే ప్రసవం: తల్లీబిడ్డ క్షేమం

TG: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 108 అంబులెన్స్‌లోనే ఒక గిరిజన మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సొంగతండాకు చెందిన రమావత్ అంజలి (21)కి పురిటి నొప్పులు రావడంతో, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో సురక్షిత ప్రసవం జరిగింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది సైదయ్య, ఎర్రబెల్లి శ్రీనివాస్‌ను అంజలి బంధువులు, మిర్యాలగూడ వైద్యులు అభినందించారు.

సంబంధిత పోస్ట్