ముంబైలోని రామ్ మందిర్ రైల్వే స్టేషన్‌లో '3 ఇడియట్స్' సినిమాలోని సీన్‌ను తలపించే ఘటన జరిగింది. ప్రసవ వేదనతో ఉన్న గర్భిణీని చూసిన ఓ వ్యక్తి తన డాక్టర్ భార్యకు వీడియో కాల్ చేసి ఆమె సూచనలతో విజయవంతంగా డెలివరీ చేశాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడిన ఆ వ్యక్తిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.