కర్నూలు వద్ద వేమూరి కావేరి బస్సు దగ్ధం దుర్ఘటన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. బస్సులు బయలుదేరే ముందే రోడ్లపై తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు బస్సులను రోడ్డెక్కించడం లేదు. రెండు రోజులుగా వందలాది బస్సులు పార్కింగ్ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. దీనితో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల వైపు వెళ్లడం లేదు. ఆన్‌లైన్ రిజర్వేషన్లలో ప్రైవేటు బస్సుల సీట్లు ఖాళీగా ఉన్నాయి.