బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఢాకాలోని ఖిల్ఖేత్‌లో దుర్గామాత ఆలయాన్ని కూల్చివేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆలయం చట్టవిరుద్ధమని బంగ్లా అధికారులు పేర్కొనగా, "అది అరాచక చర్య. మతపరమైన ఆస్తులకు రక్షణ కల్పించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత" అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు.