ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం

ఢిల్లీని బుధవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత గణనీయంగా పడిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'క్యాట్ III' ప్రమాణాలకు అనుగుణంగా లేని విమానాలు ల్యాండింగ్, టేకాఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. రైలు సర్వీసులపై కూడా పొగమంచు ప్రభావం పడటంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

సంబంధిత పోస్ట్