వాతావరణ మార్పులను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ‘ది లాన్సెట్’ నివేదిక సూచించింది. 2016–2023 మధ్య అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది మరణించగా, వీరిలో 68 శాతం మరణాలకు మానవ కార్యకలాపాల వల్ల కలిగిన వాతావరణ మార్పులే కారణమని తెలిపింది. అధిక వేడి వల్ల గత మూడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా లక్ష కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, ఆరోగ్య పరిరక్షణకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని పరిశోధకులు సూచించారు.