TG: మేడ్చల్ జిల్లా బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ప్లాస్టిక్ బకెట్‌లో 8 బండిల్స్‌లో వీటిని గుర్తించారు. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్లు ఉండగా, వాటి విలువ రూ.32 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్మీ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బొల్లారం పోలీసులు, మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్‌కు సమాచారం అందించారు. 33A సైజ్ కమర్షియల్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.