AP: దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. దేవరగట్టులోని కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దేవాలయంలో ప్రతి ఏడాది దసరా రోజున రాత్రి దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను దివిటీల వెలుగులో ఊరేగిస్తారు. ఈ విగ్రహాలను కాపాడుకోవడానికి రెండు వర్గాలుగా విభజించిన 10 గ్రామాల ప్రజలు కర్రలతో తలపడుతారు. ఈ కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది.