2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శనివారం ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. ఎన్డీఏ పాలనలో 2027 నాటికి దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెడతానని మోదీ ప్రతిజ్ఞ చేశారని అన్నారు.