చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. జోషీమఠ్-మార్వారీ రహదారిపై సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో యాత్రికులు గంటల తరబడి క్యూలో నిల్చొన్నారు. వీకెండ్, సెలవు దినాలు కావడంతో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గోవింద్‌ఘాట్, సోన్‌ప్రయాగ్ మార్గాల్లో రద్దీ మరింత పెరిగింది. ఆహారం, తాగునీటి సౌకర్యాల కొరతతో పలువురు యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్