TG: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం, మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.