గురు పౌర్ణమి రోజున సాయిబాబాను భక్తులు సద్గురువుగా పూజిస్తారు. సాయినాథుడు సద్గురువుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా భక్తులను సన్మార్గంలో నడిపించి, వారి అభ్యున్నతికి కృషి చేశారు. కలియుగంలో గురువుగా ప్రత్యక్షమై, ఎల్లవేళలా అండగా నిలిచారు. ఈ రోజు బాబాను పూజించి, ఆయన బోధనలను అనుసరిస్తే విజయం, శాంతి లభిస్తాయని భక్తుల విశ్వాసం.