విమాన టిక్కెట్ల రీఫండ్‌కు సంబంధించి డీజీసీఏ నిబంధనలను సవరించింది. టిక్కెట్ బుక్ చేసిన 48 గంటల్లో రద్దు చేసుకుంటే ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించనక్కర్లేదని, టిక్కెట్‌లో మార్పులను సైతం ఉచితంగా చేసుకోవచ్చని తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ట్రావెల్ ఏజెంట్/వారి పోర్టల్స్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే.. రిఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదే, 14 పని దినాల్లోగా ఆ చెల్లింపు పూర్తి చేయాలి. దేశీయ విమానాల్లో ప్రయాణ తేదీకి 7 రోజలు ముందు బుక్ చేసుకున్న టికెట్‌కు ఈ 'లుక్-ఇన్ ఆప్షన్' ఉండదు, అంతర్జాతీయ విమానాల్లో ఆ గడువు 15 రోజులు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టికెట్ రద్దు నిబంధనల్లోనూ మార్పులు చేపట్టింది.