ధోనీకి 'కెప్టెన్ కూల్' ట్రేడ్ మార్క్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 'కెప్టెన్ కూల్‌' ట్యాగ్ లైన్‌పై హక్కులకై ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని స్పోర్ట్స్ ట్రైనింగ్, కోచింగ్ సర్వీస్, ట్రైనింగ్ సెంటర్ల కోసం వినియోగించనున్నారు. ట్రేడ్ మార్క్స్‌ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం ధోనీ దరఖాస్తుకు ఆమోదం లభించింది. 2025 జూన్ 16న ప్రచురితమైన అధికారిక ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ఇది వచ్చింది. 120 రోజుల్లోపు ఏ అభ్యంతరాలు రాకుంటే ట్రేడ్ మార్క్ మంజూరు చేస్తారు.

సంబంధిత పోస్ట్