2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గాయాల బెడద తప్పడం లేదు. మాజీ కెప్టెన్ ధోనీ కాలి కండరాల గాయంతో రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. మరోవైపు, యువ ఆటగాడు డివాల్డ్ బ్రేవిస్ కూడా పక్కటెముకల కండరాల సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో అతడు తొలి 2 లేదా 3 మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.