ధోని, జకోవిచ్‌లో ఓ అరుదైన గుణం ఉంది: దీప్తి శర్మ

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్‌లలో ఒకే రకమైన అరుదైన గుణం ఉందని భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ పేర్కొంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే లక్షణం వీరిద్దరిలో ఉందని ఆమె తెలిపింది. వింబుల్డన్ టోర్నీ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జకోవిచ్ మానసిక దృఢత్వం, ధోని ప్రశాంతతను ప్రశంసించింది. వీరిద్దరినీ చూసి ఎంతో నేర్చుకోవచ్చని దీప్తి శర్మ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్