భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ అత్యుత్తమ భారతీయ కెప్టెన్గా అభివర్ణించారు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ధోనీనే కూల్ మైండ్సెట్, పరిణితితో కూడిన ఆటగాళ్ల డీలింగ్ విధానం వల్ల అత్యుత్తమ కెప్టెన్గా ఎంచుకుంటున్నట్లు యోగరాజ్ సింగ్ తెలిపారు. కపిల్ దేవ్ కూడా సుదీర్ఘకాలం కెప్టెన్గా కొనసాగి ఉంటే అత్యుత్తమంగా నిలిచేవారని ఆయన పేర్కొన్నారు.