2027 ప్రపంచకప్‌.. రోహిత్, కోహ్లీపై ధోని కీలక వ్యాఖ్యలు

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా అనే ప్రశ్నకు మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టతనిచ్చారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వయస్సు కంటే ఫిట్‌నెస్, ప్రదర్శనలే ముఖ్యమని తేల్చి చెప్పారు. 22 ఏళ్ల ఆటగాడు ఫిట్‌గా లేకపోతే జట్టులో ఉండకూడదని, అదే 35 ఏళ్ల ఆటగాడు ఫిట్‌గా ఉంటే ఆడించవచ్చని అన్నారు. ప్రపంచకప్‌లో అనుభవం కీలకమని, యువత, సీనియర్ల అనుభవం కలయికతోనే జట్టు గెలుస్తుందని ధోని అభిప్రాయపడ్డారు. ప్రదర్శన ఉంటేనే జట్టులో ఉంటారని, లేదంటే తప్పిస్తారని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్