ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ.1226 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇండియా మార్కెట్‌లో రూ.778.77 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ.930.44 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ఈ ఏడాది అతిపెద్ద థియేట్రికల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.