ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాల వసూళ్ల రికార్డును బద్దలు కొట్టింది. గత తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరని 'బాహుబలి 2' రికార్డును అధిగమించి, 21 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. కల్కి 2898 AD, పఠాన్, జవాన్, RRR, పుష్ప 2 వంటి చిత్రాలను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. ఆస్ట్రేలియాలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.