ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సినిమా అంచనాలకు మించి విజయం సాధించి కొత్త రికార్డులను సృష్టించింది. డిసెంబర్ 5న భారత్‌తో పాటు యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో విడుదలైన ఈ చిత్రం, పశ్చిమాసియా (గల్ఫ్ దేశాల్లో) మాత్రం నిషేధానికి గురైంది. పాకిస్థాన్‌కు వ్యతిరేక అంశాలతో తెరకెక్కించడమే దీనికి కారణమని బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. గల్ఫ్ మార్కెట్‌లో సినిమా విడుదల కాకపోవడం వల్ల సుమారు రూ. 90 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు విదేశీ పంపిణీదారు ప్రణబ్ కపాడియా వెల్లడించారు.