రణ్వీర్ సింగ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ధురంధర్’ టీవీ ప్రసారం కోసం మరోసారి సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లింది. థియేటర్లలో 'ఏ' సర్టిఫికెట్తో విడుదలైన ఈ సినిమా, బుల్లితెరపై ప్రసారం చేయడానికి వీలుగా 45-50 కట్స్‌ను సెన్సార్ బోర్డు సూచించింది. ఈ మార్పుల అనంతరం చిత్రానికి 'యూ/ఏ 16+' సర్టిఫికెట్ లభించింది. దీంతో సినిమా నిడివి సుమారు 10 నిమిషాలు తగ్గినట్లు సమాచారం. ‘ధురంధర్: ది రివెంజ్’ పేరుతో ఈ చిత్రం అక్టోబరు 18న స్టార్గోల్డ్లో ప్రసారం కానుంది.