ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం!

తమిళనాడులోని తిరువారూర్ జిల్లా నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని గ్రామంలోని వెన్ని కరుంబేశ్వరర్ ఆలయంలోని శివలింగం మధుమేహాన్ని నయం చేస్తుందని భక్తులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ స్వయంభూ దేవాలయంలో శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. భక్తులు స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి, చీమలు తినేలా కొద్దిగా పెడతారు. చీమలు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుతుందని వారి ప్రగాఢ విశ్వాసం.  ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్