ప్రస్తుత కాలంలో యువత ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో 50 ఏళ్లలో వచ్చే ఆరోగ్య సమస్యలు 30 ఏళ్లలోపే వస్తున్నాయని 'హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026' నివేదిక హెచ్చరించింది. అపోలో హాస్పిటల్స్ నివేదిక ప్రకారం, 30 ఏళ్ల లోపు ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నారు. సగానికి పైగా యువతుల్లో ఒబెసిటీ, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయులు కనిపిస్తున్నాయి. కూర్చునే జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం దీనికి కారణాలని వైద్యులు పేర్కొన్నారు.