ఇరాన్‌కు 24 గంటల డెడ్‌లైన్ ఫిక్స్ చేసిన అమెరికా?

ఇరాన్‌కు అమెరికా 24 గంటల గడువు విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేస్తామని బహిరంగంగా ప్రకటించాలని, జలసంధి అన్ని నౌకలకు ఎలాంటి రుసుము లేకుండా తెరిచి ఉంటుందని స్పష్టం చేయాలని అమెరికా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ షరతులను పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, తాము చర్చల కోసం అమెరికాను సంప్రదించలేదని, తమ వైఖరిలో మార్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్