చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను మహేంద్ర సింగ్ ధోనీ యువ క్రికెట్ రుతురాజ్ గైక్వాడ్‌కి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే కొత్త సీజన్‌లో కొత్త పాత్రలో కనిపించబోతున్నానని ధోనీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ధోనీ ముందే హింట్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అతను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.