TGలో గొడవలు సృష్టించేందుకే అమిత్ షాను పవన్ కలిశారేమో: కాంగ్రెస్ MLA

తెలంగాణలో గొడవలు సృష్టించేందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారేమోనని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ ఆరోపించారు. అమిత్ షా, TG మాజీ సీఎం కేసీఆర్‌ను ఇంప్రెస్ చేసేందుకు పవన్  ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. 'ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే అక్కడికి వెళ్తావు. జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే అటూ వెళ్లొచ్చు. 'OG', 'ఉస్తాద్' సినిమాలు ఫ్లాప్ అవడంతో పవన్ డిప్రెషన్‌లో మాట్లాడుతున్నారు. నువ్వు హైదరాబాద్‌లో ఎప్పటికీ ఉండొచ్చు. తెలంగాణలో డిపాజిట్ రావడమూ కష్టమే' అని అనిరుధ్ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్