TG: మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై జరిగిన పోలీసుల దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "వినయ్ భాస్కర్‌ను చంపేద్దామనుకున్నారా?" అని ప్రశ్నిస్తూ, బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే ఆయనపై మళ్లీ దాడి చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన పోలీసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ, ప్రతీ విషయాన్ని డైరీలో రాసుకుంటున్నామని, బాధ్యులపై చర్యలు తప్పవని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.