దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్లాసిక్ మూవీ ‘గోదావరి’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో హీరో రోల్ కోసం మొదటగా సిద్ధార్థ్‌ను సంప్రదించాం అని చెప్పారు. అయితే కథ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆయన నో చెప్పారన్నారు. తర్వాత మహేశ్‌బాబును కూడా అనుకున్నా, కానీ కలవలేదని చెప్పారు. చివరకు రామ్ పాత్ర కోసం సుమంత్‌ను ఎంపిక చేశామన్నారు. హీరోయిన్‌గా కమలినిని తీసుకున్నామని వివరించారు.