మీ వాహనంపై తప్పుగా ఈ-చలాన్‌ వచ్చిందా?.. ఇలా ఫిర్యాదు చేయండి?

మీ వాహనంపై పొరపాటుగా వచ్చిన ఈ-చలాన్‌పై ఫిర్యాదు చేయాలంటే echallan.parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Complaint’ ట్యాబ్‌ క్లిక్ చేయాలి. చలాన్ నంబర్, వాహన నంబర్, పేరుతోపాటు సమస్య వివరాలు (500 అక్షరాల్లో) నమోదు చేసి ఆధారాలు ఉంటే అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు అనంతరం టికెట్ నంబర్ వస్తుంది. అలాగే, helpdesk-echallan@gov.inకి మెయిల్ చేయొచ్చు లేదా 120-4925505 నంబరుకు కాల్ చేయొచ్చు. IVRSలో ‘4’ నొక్కితే కూడా సహాయం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్