ITR రీఫండ్ రాలేదా?.. అయితే ఇలా చేయండి!

మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సమయానికి దాఖలు చేసినా కూడా రీఫండ్ రాలేదా?. అయితే ఆందోళన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 244A ప్రకారం ప్రభుత్వం రీఫండ్ ఆలస్యమైతే వడ్డీతో చెల్లించాల్సిందే. మీరు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 16, 2025లోపు ITR దాఖలు చేసి ఉంటే, ఏప్రిల్ 1, 2025 నుండి రీఫండ్ బ్యాంక్‌లో జమ అయ్యే వరకు వడ్డీ లెక్కించబడుతుంది. వడ్డీ రేటు నెలకు 0.5% (ఏటా 6%)తో కలిపి ఇస్తుంది. అయితే, రీఫండ్ ఆలస్యం మీ పొరపాట్ల వలన జరిగితే వడ్డీ రాదు.

సంబంధిత పోస్ట్