దర్శకుడు హరీష్ శంకర్ పుట్టినరోజున మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ శుభాకాంక్షలు చెప్పలేదు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లిస్ట్‌లో హరీష్ శంకర్ కనిపించకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విషయంలో దేవి శ్రీ ప్రసాద్, తమన్ మధ్య జరిగిన పరిణామాలపై హరీష్ శంకర్ ఇచ్చిన వివరణలు నమ్మశక్యంగా లేవని, అంతర్గత విభేదాల వల్లే దేవి శ్రీ ప్రసాద్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.