డిజిటల్ వ్యసనం.. దేశానికి కొత్త ఆరోగ్య సంక్షోభం: ఆర్థిక సర్వే హెచ్చరిక

దేశ యువత, పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ వ్యసనంపై 2025-26 ఆర్థిక సర్వే నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన, ఒబెసిటీ, డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ఇది ఆత్మహత్యలకు దారితీస్తుందని నివేదిక హెచ్చరించింది. జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం, గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత, సైబర్-సేఫ్టీ విద్య వంటి సూచనలు చేసింది. దేశ జీడీపీపై కూడా ఈ ఆరోగ్య సమస్యల భారం పడుతుందని సర్వే పేర్కొంది.

సంబంధిత పోస్ట్