దేశవ్యాప్తంగా 16వ జనాభా గణన ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు దశల్లో డిజిటల్ పద్ధతిలో ప్రారంభం కానుంది. ఈసారి సహజీవన జంటలను కూడా ఒకే కుటుంబంగా గుర్తించనున్నారు. అధికారులు మొబైల్ యాప్‌తో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. వ్యక్తుల సంఖ్య, వయస్సు, విద్యతో పాటు తాగునీటి వనరులు, వంటగది సౌకర్యాలు, ఇంటర్నెట్, వాహనాలు వంటి 33 అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.