నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన పొలిటికల్ డ్రామా 'సత్లుజ్' (Satluj) సినిమా ఓటీటీలో విడుదలైన 48 గంటల్లోనే భారతదేశంలో నిషేధించబడింది. 1984-1994 మధ్య పంజాబ్‌లో జరిగిన తీవ్రవాద అణచివేత నేపథ్యంలో వేలాది మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారనే ఆరోపణలపై హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రాజకీయ కారణాలతో సినిమాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.