ఇంట్లోని పూజా మందిరాన్ని ఈశాన్య మూలలో ఏర్పాటు చేయడం ఉత్తమమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే, తూర్పు, ఉత్తర గోడను ఎంచుకోవచ్చు. లక్ష్మీదేవిని గణేశుడి కుడి వైపున ఉంచాలి. విగ్రహాలు తూర్పు, పడమర దిశలో ఉండేలా చూసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు విగ్రహాలకు వ్యతిరేక దిశలో నిలబడాలి. విగ్రహాలను నేలపై కాకుండా ఎత్తైన వేదికపై ఉంచాలని వివరించారు.