తెలుగు సినిమా పరిశ్రమలో రవితేజకు హీరోగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు ప్రమోద్ కుమార్.. సోమవారం భరత్ నగర్ రైల్వే స్టేషన్‌లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. గత 25 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో సేవలందిస్తున్న ప్రమోద్ కుమార్ అకస్మాత్తుగా మరణించడం సినీ వర్గాలను, ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన 'మనసిచ్చాను' సినిమాతో రవితేజను హీరోగా పరిచయం చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.