డైరెక్టర్ తేజా కుమారుడికి రూ.72 లక్షల కుచ్చుటోపీ

ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగిన సైబర్ నేరంలో రూ.72 లక్షలు కోల్పోయారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించిన ఓ దంపతులు అమితవ్ తేజ నుంచి పలు దఫాలుగా డబ్బు వసూలు చేసి మోసగించారు. పెట్టుబడి తిరిగి రాకపోవడంతో పాటు, నిందితులు ఫోన్ నంబర్లు మార్చి పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన అమితవ్ తేజ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దంపతులపై ఐటీ యాక్ట్, చీటింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్