దివ్యాంగురాలిపై బాలుడు అత్యాచారం.. నగదు చోరీ

ములుగు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన యువతిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, నిందితుడు ఇంట్లో ఉన్న రూ. 4 వేల నగదును కూడా అపహరించాడని సమాచారం. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕