రాజ్యసభ పదవి హామీ నెరవేరకపోవడంతో వైఎస్ షర్మిల మౌనం వహించినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా, అది అమలు కాలేదని తెలుస్తోంది. అంతేకాకుండా, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వేరే నేతకు అప్పగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో, రాజకీయంగా తనకు ఎటువంటి ఉన్నతి లేకుండా పోయిందనే ఆవేదనతో షర్మిల సైలెంట్‌గా ఉన్నారని భావిస్తున్నారు. తెర వెనుక ఏం జరిగిందో వారికే తెలియాలి.