రామాలయంలో అపశృతి.. కూలిన టెంట్లు, పగిలిన తలలు

శ్రీరామనవమి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహణలో అపశృతి చోటుచేసుకుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు భోజనాలు వితరణ చేస్తుండగా, ఆకస్మికంగా వచ్చిన గాలి దుమారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేసింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులకు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్