హైదరాబాద్ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ భేటీ (వీడియో)

TG: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ పీసీసీ జనరల్ సెక్రటరీ ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై కమిటీ సభ్యులు చర్చించగా, పెండింగ్‌లో ఉన్న ఇతర ఫిర్యాదులపైనా సమీక్ష కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్