‘మాస్ జాతర’ ఈవెంట్లో రాజేందప్రసాద్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సంగీత దర్శకుడు భీమ్స్ స్టేజి పై మాట్లాడుతూ ఈ మూవీలో నటించిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతుండగా స్టేజి కింద కూర్చొని తన పేరును మర్చిపోయాడని సైగలు చేయడం అలాగే హీరో సూర్య భీమ్స్ ను అభినందిస్తుండగా వారిద్దరి మధ్య దూరి తన గురించే మాట్లాడుతున్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో మొత్తానికి ఆయన హాట్ టాపిక్‌గా మారారు.